Homeనల్లగొండAwareness | వరిలో విత్తనోత్పత్తి పై రైతులకు అవగాహన కార్యక్రమం

Awareness | వరిలో విత్తనోత్పత్తి పై రైతులకు అవగాహన కార్యక్రమం

  • నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యం…
  • క్షేత్రస్థాయి మెలకువలు, యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తల సూచనలు…

వరి సాగులో నాణ్యమైన విత్తనాల ఎంపికతో పాటు శాస్త్రీయ పద్ధతుల్లో విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మేళ్లచెరువులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సభ్యులు, రైతులకు బుధవారం ‘వరిలో విత్తనోత్పత్తి’ (Seed Production Awareness) అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాల ప్రాధాన్యత ఎంతో కీలకమన్నారు.

విత్తనాలను ఎంపిక చేసుకునే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.నాణ్యమైన విత్తనాలను వినియోగించడం ద్వారా పంట మొలక శాతం మెరుగుపడి, పంట నాణ్యతతో పాటు దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం హుజూర్‌నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.శివప్రసాద్ మాట్లాడుతూ వరి పంటలో విత్తనోత్పత్తి చేపట్టే (Seed Production Awareness) సమయంలో రైతులు పాటించాల్సిన క్షేత్రస్థాయి మెలకువలను వివరించారు.

- Advertisement -

విత్తనోత్పత్తి సమయంలో పంటను నిశితంగా పరిశీలించడం, కల్తీ రకాలను తొలగించడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తనోత్పత్తిలో శాస్త్రీయ పద్ధతులను పాటించడం వల్ల నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడంతో పాటు భవిష్యత్ సాగుకు మేలు జరుగుతుందని నిపుణులు సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శంభీరెడ్డి, సీఈఓ గుమ్మిత వెంకట్‌రెడ్డి,సహకార సంఘ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News