Homeమేడ్చెల్‌Government Land Encroachment | సర్వే నంబర్ 277లో అక్రమ నిర్మాణాలు.. రెవెన్యూ శాఖ మౌనం...

Government Land Encroachment | సర్వే నంబర్ 277లో అక్రమ నిర్మాణాలు.. రెవెన్యూ శాఖ మౌనం ఎందుకు?

  • నాడు మార్కెట్‌కు కేటాయిస్తామన్న ప్రభుత్వ భూమి నేడు ఆక్రమణలకు గురవుతోందని స్థానికుల ఆవేదన

జవహర్‌నగర్ పరిధిలోని సర్వే నంబర్ 277లో ఉన్న ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాలు (Government Land Encroachment) జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నాడు ఈ ప్రభుత్వ స్థలాన్ని కూరగాయలు, మాంసం మార్కెట్ ఏర్పాటుకు కేటాయించేందుకు రెవెన్యూ శాఖ పరిశీలిస్తోందని అధికారులు చెప్పినప్పటికీ, ప్రస్తుతం అదే స్థలంలో రాత్రికి రాత్రే నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Survey No. 277 Government Land Encroachment Allegations

ప్రభుత్వ స్థలం అని తెలిసినప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్న సమయంలో సంబంధిత రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు అక్రమ నిర్మాణాలపై స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

- Advertisement -
Locals have raised concerns over alleged illegal constructions on government land in Survey No. 277 within Jawaharnagar limits and urged revenue officials to survey and protect the property.5

ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ 277లో సమగ్రంగా భూ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమి హద్దులను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. అనంతరం ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తెలియజేసే హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడి, నాడు ప్రతిపాదించిన మార్కెట్ వంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సర్వే నంబర్ 277పై వాస్తవ పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. (https://epaper.aadabhyderabad.in/) (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News