- సెలెక్ట్ చేసిన మార్క్ జూకర్ బర్గ్..
- తన ఏఐ సామ్రాజ్యాన్ని నడిపేందుకు ప్లాన్..
మెటా కొత్తగా చేపట్టిన ఎంటర్‌ప్రైజ్ ఏఐ వ్యాపారాన్ని నడిపించేందుకు మార్క్ జుకర్‌బర్గ్ ఓ భారతీయ మూలాలున్న టెక్ నిపుణుడిని ఎంపిక చేశారు. ఆయన పేరే చిరంతన్ “సీజే” దేశాయ్. (Chirantan Desai) కేవలం 11 నెలల క్రితమే మాంగోడీబీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన దేశాయ్‌ను ఇప్పుడు మెటా తన కొత్త బిజినెస్ కోసం తీసుకుంది. ఆయన నేరుగా జుకర్‌బర్గ్‌కు రిపోర్ట్ చేయనున్నారంటే.. మెటాలో ఆయన ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోంది.
మెటా కొత్తగా ప్రారంభించిన మెటా ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్ వ్యాపారానికి దేశాయ్ చీఫ్ ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌పామ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. సంస్థలో ఇది తదుపరి ప్రధాన వ్యాపార విభాగంగా ఉంటుందని జుకర్‌బర్గ్ చెబుతున్నారు. వ్యాపార సంస్థలు, డెవలపర్ల కోసం ఏఐ టూల్స్ అందించడమే ఈ కొత్త విభాగం లక్ష్యం. తన నియామకంపై దేశాయ్ (Chirantan Desai) కూడా ఉత్సాహం వ్యక్తం చేశారు. దేశాయ్‌కు ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాబేస్‌లు, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.
ఒరాకిల్, సిమాంటెక్, ఈఎంసీ, సర్వీస్‌నౌ, క్లౌడ్‌ఫ్లేర్, మాంగోడీబీ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. పెద్ద సంస్థల కోసం టెక్నాలజీ ఉత్పత్తులను రూపొందించడం, వ్యాపారాలను విస్తరించడంలో ఆయనకు అనుభవం ఉంది. దేశాయ్ బెంగళూరులో పుట్టి పెరిగారు. 1993లో కుటుంబంతో అమెరికాకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-షాంపెయిన్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్, ఎంబీఏ పూర్తి చేశారు. 1995లో ఒరాకిల్‌తో కెరీర్ ప్రారంభించి, బెంగళూరులో ఆఫ్‌షోర్ వ్యాపారాలను నిర్మించడంలోనూ పనిచేశారు. (https://epaper.aadabhyderabad.in/), (Youtube)
