- భట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన
- ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించడం లేదంటూ ఆవేదన
- ఎన్నిసార్లు తిరిగినా భట్టి కలవడం లేదని ఆగ్రహం
- పోలీసులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల మధ్య వాగ్వాదం
- అపాయింట్‌మెంట్ కోసం భీష్మించిన నిరసనకారులు
పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు వారు నిరసన(Protest)చేపట్టారు. తమకు రావాల్సిన బిల్లులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని నిరసనకారులు ఆరోపించారు.


తమ సమస్యను నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఛాంబర్ ముందు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా.. కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, తమ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
