Homeనిజామాబాద్‌Nandiwada | నందివాడ లో లీగ దూడను చంపిన చిరుత పులి…?

Nandiwada | నందివాడ లో లీగ దూడను చంపిన చిరుత పులి…?

తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామ పరిధిలోని పెర్మాయికుంట తాండ శివారులో ఓ లేగ దూడను చిరుతపులి చంపిన సంఘటన కలకలం రేపుతుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పిర్మయ్య కుంట తండా కు చెందిన జాదవ్ సంతోష్ కు చెందిన లేగ దూడ రెండు రోజుల క్రితం మేతకు వెళ్లి కనిపించకుండా పోయింది. రెండు రోజులుగా కుటుంబ సభ్యులు లేగ దూడ కోసం గాలించగా ఆచూకీ కనిపించలేదు.

మంగళవారం అడవిలోకి మేకలు కాయడానికి వెళ్ళిన మేకల కాపరులు అక్కడ సగం తినేసిన లేగదుడా మృతదేహం కనిపించింది. వారు గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా, వెళ్లి చూడగా అక్కడ సంతోష్ కి చెందిన లేగ దూడను పులి చంపినట్టు ఆనవాళ్లు లభించాయని గ్రామస్తులు తెలిపారు. చిరుతపురి సంచరిస్తడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు చిరుతపులి నుండి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుచున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News