Homeరంగారెడ్డిEtela Rajender | రైల్వే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.

Etela Rajender | రైల్వే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.

  • మేడ్చల్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి స్టేషన్లు,ఆర్ యు బి లు పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్

మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పెండింగ్‌లో ఉన్న రైల్వే స్టేషన్లు, ఆర్‌యూబీ (RUB) పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు.

మంగళవారం మేడ్చల్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు ఆయా ప్రాంతాల్లోని రైల్వే అండర్ బ్రిడ్జిలను ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. రైల్వే అధికారులతో కలిసి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో జాప్యానికి కారణాలను తెలుసుకుని, మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మేడ్చల్ ప్రాంతంలో కూడా రైల్వే మౌలిక వసతులు మరింత మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రహదారి అనుసంధానం, పార్కింగ్, ప్లాట్‌ఫారాలు, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అదే విధంగా RUBల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచాలని చెప్పారు.

మేడ్చల్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైల్వే రవాణా వ్యవస్థ కూడా అందుకు అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తగ్గేలా రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలపై స్థానిక నాయకులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను కూడా ఆయన పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ డివిజన్ ఇన్‌చార్జి పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి, జగన్ గౌడ్, కోశాధికారి లవంగ శ్రీకాంత్, మేడ్చల్ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి మురళీ గుప్త, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాగం అర్జున్, మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ ప్రధాన కార్యదర్శులు కానుకంటి వంశీ విజయ్ వంజరి, జకట ప్రేమదాసు, ఉపాధ్యక్షులు మైసరి రాజు వంజరి, సర్వేశ్వర రెడ్డి, కార్యదర్శి విష్ణు గౌడ్, సీనియర్ నాయకులు థాత్రిక లక్ష్మణ్ వంజరి, చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, నాయకులు రాఘవ రెడ్డి, గోపు నాగరాజు, వంశీ రెడ్డి, పోతుల హరిబాబు రెడ్డి, మామిళ్ల నర్సింగ్, మహేష్ గౌలికర్, పురుషోత్తం, మహీందర్, మహిళా నాయకురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News