Homeరంగారెడ్డిPudur | పూడూరులో సీసీ రోడ్ల పనులను ప్రారంభం

Pudur | పూడూరులో సీసీ రోడ్ల పనులను ప్రారంభం

  • గ్రామ పెద్దలు, నాయకులు

మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో పూడూరు గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం నాయకులు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సృజన,డిప్యూటీ కమిషనర్ సుధాంశుకు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పూడూరు గ్రామంలోని అన్ని రోడ్లకు నిధులు మంజూరైనట్లు వారు పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమవంతు కృషి ఎల్లప్పుడూ కొనసాగుతుందని నాయకులు తెలిపారు.ముఖ్యంగా సీసీ రోడ్లు,డ్రైనేజీలు,స్ట్రీట్ లైట్లు తదితర సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి,కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సింగరేణి పోచయ్య, మాజీ సర్పంచ్ బాబు యాదవ్,మాజీ సొసైటీ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ నీరుడి రఘు, మాజీ ఉప సర్పంచ్ మానేపల్లి వెంకటేష్, మాజీ వార్డు సభ్యులు హన్మంత్ రెడ్డి, శేషికుమార్,పుట్నాల శ్రీకాంత్,గ్రామస్తులు తుపాకుల తిరుపతి,బక్క నాగరాజు, బక్క శేఖర్, గడ్డం బాబు, శ్రీశైలం యాదవ్,తుపాకుల ప్రభాకర్,డప్పు బిక్షపతి, మజ్జిగ శంకర్ రెడ్డి,కుంట రంగారెడ్డి, నీరుడి సుధాకర్,ఏర్పుల మహేష్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News