Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | బోనం.. వేల ఏండ్ల తెలంగాణ సంస్కృతి

Aaj Ki Baath | బోనం.. వేల ఏండ్ల తెలంగాణ సంస్కృతి

బోనమంటే ఒట్టిగనే మట్టి కుండల నింపిన బువ్వ
కాదయ్యో… అది వేల ఏండ్ల సంది ప్రకృతిని
మొక్కుకుంట వస్తున్న మన తెలంగాణ మట్టి మూలాల
సంస్కృతి, మన బతుకు వేదం! చరిత్ర పుటలల్ల
1816 నాటి ప్లేగు రోగాన్ని ఎళ్లగొట్టేటందుకు లష్కర్
బోనాలు మొదలైనయని ఓ లెక్క ఉండొచ్చు గాక…
కానీ ఈ మట్టి లోతుల్లోకి తొంగి చూస్తే, ఎప్పుడో
పాత కాలంల నాగరికత మొదలైనప్పటి నుంచే మన
ఊరిని కాపాడే దేవతలకు బియ్యం, పసుపు,
ఏపాకులతో దండం పెట్టుకున్న ఆదిమ ఆచారమే
ఈనాటి బోనం! శాతవాహనులు, కాకతీయుల
ఏలుబడి నాటి పల్లె బతుకుల్లోనూ ఊరి దేవతలను
శాంతింపజేసే ఈ తల్లి పూజ కనిపిస్తది. ఆషాఢంల
తొలి వానలు పడంగనే రోగాలు, రొష్టులు రాకుండా
ప్రకృతి శక్తులను, అమ్మవార్లను ఎంతో భక్తితో కొలిచే
ఈ పండుగ.. ఒక్కనాడు జరిగిన ముచ్చట కాదు..
యుగయుగాలుగా తరతరాల మన నెత్తుర్ల
పారుతున్న తెలంగాణ ఆత్మగౌరవ జెండా!

- Advertisement -
RELATED ARTICLES

Latest News