Homeఆరోగ్యంProtein | ప్రోటీన్, గ్రుడ్లు వీటిలో ఏది బెస్టో తెలుసా..?

Protein | ప్రోటీన్, గ్రుడ్లు వీటిలో ఏది బెస్టో తెలుసా..?

  • ప్రోటీన్ కు ఈ రెండూ మంచివే..
  • ప్రోటీన్, క్యాలరీలు, కొవ్వు పరంగా రెంటికీ కొంచం తేడా..

ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేవి చికెన్‌, గుడ్లు. జిమ్‌కు వెళ్లేవాళ్లు, బరువు తగ్గాలనుకునేవాళ్లు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవాళ్లు ఈ రెండింటినీ ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే రెండూ ప్రొటీన్‌కు మంచి వనరులే అయినప్పటికీ.. తక్కువ క్యాలరీల్లో ఎక్కువ ప్రొటీన్‌ ఏది ఇస్తుంది? చికెన్‌, గుడ్లలో ఏది మంచి ఎంపిక? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

చికెన్‌, గుడ్లు రెండూ శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. కానీ ప్రొటీన్‌, క్యాలరీలు, కొవ్వు పరంగా చూస్తే రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉంది. అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం.. 100 గ్రాముల ఉడికించిన స్కిన్‌లెస్‌ చికెన్‌ బ్రెస్ట్‌లో 31 గ్రాముల ప్రొటీన్‌, 165 క్యాలరీలు, 3.6 గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే 100 గ్రాముల ఉడికించిన గుడ్లలో 12.6 గ్రాముల ప్రొటీన్‌, 155 క్యాలరీలు, 10.6 గ్రాముల కొవ్వు ఉంటుంది.

- Advertisement -

ఇక్కడ గమనించాల్సింది క్యాలరీల్లో పెద్దగా తేడా లేకపోవడం. రెండింటి మధ్య కేవలం 10 క్యాలరీలే తేడా ఉంది. కానీ ప్రొటీన్‌ విషయంలో మాత్రం చికెన్‌ స్పష్టంగా ముందంజలో ఉంది. గుడ్లతో పోలిస్తే రెండున్నర రెట్లు ఎక్కువ ప్రొటీన్‌ను అందిస్తుంది. కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కండరాల పెరుగుదల, బరువు నియంత్రణ, ఎక్కువ ప్రొటీన్‌ తీసుకోవాలనుకునేవారికి చికెన్‌ బ్రెస్ట్‌ను నిపుణులు సూచిస్తుంటారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News