నేటి శిశువు ఏసి రూంలో జన్మించి..
పుట్టుకతోనే ‘ఐక్యూ’ను వెంటేసుకొని..
అమ్మానాన్నల అతి గారాల పట్టిగా..
ఇంటి నాలుగు గోడల జైల్లో..
సమాజానికి బహు దూరంగా..
స్మార్ట్ సో’సెల్’ మాద్యమాల్లో..
రేయింబవళ్లు మునిగి తేలుతూ..
అదే గదిలో తింటూ, అక్కడే..
మలమూత్ర విసర్జన చేస్తూ..
గొంతమ్మ కోర్కెలు తీర్చని వేళ..
ఇంటిని యుద్ధ క్షేత్రంగా మార్చుతూ..
పది మందిలో పిల్లిలా మారి..
ఇంట్లో యువరాజు/రాణిగా కాలరెగిరేసి..
చిట్టి వైఫల్యానికే తెగ బాధ పడుతూ..
ఒంటరితనాన్ని వెంటేసుకొని..
మానసిక రోగిగా మారి పోయి..
మైదాన ఆటలకు మంగళం పలికి..
వీడియో గేమ్స్‌లో కప్పులు గెలుస్తూ..
బంధుమిత్రులకు బహు దూరంగా..
తన చిట్టి గృహ సామ్రాజ్యంలో..
బ్రాయిలర్ కోడి వలె బతుకుతున్న..
నవ సమాజ మెరుగని నేటి పిల్లలు
జీవించే కళ తెలియని డిజిటల్ పిచ్చోళ్లు !
Modern Children | బ్రాయిలర్ కోడి బాలలు
- Advertisement -
