HomeజాతీయంPrashant Kishor | ప్రశాంత్ కిషోర్ కి షాక్..

Prashant Kishor | ప్రశాంత్ కిషోర్ కి షాక్..

  • బీజేపీలోకి జన సురాజ్ పార్టీ కీలక నేతలు..
  • బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ముందు ఎదురుదెబ్బ..

బంకిపుర్ అసెంబ్లీ ఉపఎన్నికకు కొద్ది వారాల ముందు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) స్థాపించిన జన సురాజ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బుధవారం బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిపై పీకే స్వయంగా పోటీ చేస్తున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీలో చేరిన వారిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ తరఫున పోటీ చేసిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త కేసీ సిన్హా, రితేష్ రంజన్, గోపాల్ సింగ్‌లతో పాటు జన సురాజ్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బ్రజ్ కిశోర్ సిన్హా కూడా ఉన్నారు.

ఈ చేరికలపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరయోగి హర్షం వ్యక్తం చేశారు. “ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, విధానాలకు ఆకర్షితులై దేశవ్యాప్తంగా విపక్ష నేతలు బీజేపీలో చేరుతున్నారు. ఈ చేరికలు రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారిన నేతలు తమ నిర్ణయానికి గల కారణాలను వివరించారు. జాతీయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరినట్లు కేసీ సిన్హా పేర్కొనగా, ఇది తనకు సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లుగా ఉందని రితేష్ రంజన్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

జన సురాజ్‌ పార్టీకి సరైన దార్శనికత, నాయకత్వం లేవని గోపాల్ సింగ్ విమర్శించారు. బీజేపీ నేత నితిన్ నబిన్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులు కావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో బంకిపుర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గానికి జూలై 30న పోలింగ్ జరగనుండగా, ఆగస్టు 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉప ఎన్నిక ద్వారానే ప్రశాంత్ కిశోర్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతుండటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News