Tuesday, June 16, 2026
Homeబిజినెస్Supreme Court | పల్సన్ గ్రూప్ కు సుప్రీంలో ఊరట..

Supreme Court | పల్సన్ గ్రూప్ కు సుప్రీంలో ఊరట..

  • ఏ ఐ, హెల్త్ కేర్ టెక్నాలజీ, డిజిటల్
  • సేవల రంగాల్లో ఇక వేగవంతమైన ప్రక్రియ..

తెలంగాణలోని మియాపూర్‌ సమీపంలోని అమీన్‌పూర్‌లో అభివృద్ధి చెందుతున్న పల్సస్‌ గ్రూపు ఏఐ హెల్త్‌కేర్‌ అండ్‌ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రాజెక్టు స్థలంలో ఐటీ/ఐటీఈఎస్‌ పార్క్‌, ప్రత్యేక ఆర్థిక మండలి హోదాలను సుప్రీంకోర్టు కొనసాగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో రూ.500 కోట్ల వ్యయంతో అభివృద్ధి చెందుతున్న 35 ఎకరాల మియాపూర్‌ క్యాంపస్‌ను మరింత విస్తరించి, ప్రత్యక్షంగా 6 వేల మందికి, పరోక్షంగా సుమారు 30 వేల మందికి ఉపాది అవకాశాలను సృష్టించనున్నట్లు పల్సస్‌ గ్రూపు ప్రకటించింది.

ఏఐ, హెల్త్‌కేర్‌ టెక్నాలజీ, డిజిటల్‌ సేవల రంగాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఈ తీర్పు కీలకంగా మారిందని, ప్రాజెక్టునకు సంబంధించి చట్టపరమైన అనిశ్చితులు తొలగిపోవడంతో కొత్త పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News