Friday, June 12, 2026
Homeహైదరాబాద్‌గాంధీ ఫోరెన్సిక్ నూతన సారధిగా డా.నాగ మోహన్ రావు

గాంధీ ఫోరెన్సిక్ నూతన సారధిగా డా.నాగ మోహన్ రావు

  • సూపరింటెండెంట్ డా.వాణిని కలిసిన డా.నాగ మోహన్
  • ఫోరెన్సిక్ సేవల మెరుగుదల,నాణ్యమైన బోధనే లక్ష్యం

గాంధీ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డా. బి.వి.నాగ మోహన్ రావు శనివారం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వాణి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డా.నాగ మోహన్ రావు ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగ అభివృద్ధి,విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించడం,ఆధునిక బోధనా పద్ధతులను ప్రవేశపెట్టడం,మెడికో-లీగల్ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలపై చర్చించారు.

అలాగే విభాగంలో పరిశోధనలకు ప్రోత్సాహం కల్పించడం, విద్యార్థులలో ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురావడం వంటి భవిష్యత్ కార్యాచరణపై తమ ప్రణాళికలను వివరించారు.గాంధీ మెడికల్ కళాశాల రాష్ట్రంలో ప్రముఖ వైద్య విద్యా సంస్థగా మరింత గుర్తింపు పొందేలా ఫోరెన్సిక్ విభాగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని డా.నాగ మోహన్ రావు తెలిపారు.

- Advertisement -

విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు,న్యాయ వైద్య సేవల నాణ్యత మెరుగుదల కోసం అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డా. వాణి డా.నాగ మోహన్ రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అభివృద్ధికి ఆసుపత్రి నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.గాంధీ మెడికల్ కళాశాల,గాంధీ ఆసుపత్రి ప్రతిష్ఠను మరింత పెంచే విధంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News