మాటలు అందరికీ అర్థం అవుతాయి
మౌనానికి లోతైన అర్థం ఉంటుంది
మౌన భాషను అర్థం చేసుకున్న వారే..
అసలు సిసలైన నా వాళ్లు అవుతారు !
ఎవరి కోసం ఎదురుచూడకు..
నీ యుద్ధం నీవే చేయాలి
సుదీర్ఘ జీవన పోరాట క్షేత్రంలో..
ప్రత్యర్థి వర్గంలో అందరూ నీ వాళ్లే..
అర్జునుడు, కృష్ణుడు కూడా నువ్వే !
- Advertisement -
నేనేమిటో లోకానికి అసలే తెలియదు
వారికి తెలిసిందేమిటో అది నేను కాదు
నా గూర్చి తెలుసుకోవడం వారి పని కాదు
నువ్వేమిటో ఎవరికీ చెప్ప అవసరం లేదు !
విలువ, టైం విచిత్రమైన జంట..
విలువనిచ్చినోళ్లు నీకు టైం ఇవ్వరు
టైం ఇచ్చినోళ్లు నిన్ను పట్టించుకోరు
టైంకి విలువనిచ్చి ఎదగడం నేర్చుకో !
పెదవులపై గలగలల గంగా..
చేతుల నిండా తిరంగా జెండా..
గొంతులో జై హిందు నినాదాలు
చేతల్లో చైతన్య ప్రగతి కవాతులు
ఇదే కదా భారతమాత కోరికలు !
- Advertisement -
