Saturday, May 9, 2026
HomeజాతీయంMagic Mark | ఒకే ఒక్క సీటు..

Magic Mark | ఒకే ఒక్క సీటు..

  • విజయ్ ని ఊరిస్తున్న సీఎం సీటు..

టీవీకే చీఫ్ విజ‌య్ .. ఎప్పుడు సీఎం అవుతార‌న్న ఉత్కంఠ నెల‌కొన్న‌ది. 107 సీట్లు సాధించిన ఆ పార్టీ .. మ్యాజిక్ మార్క్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. నిజానికి 108 స్థానాల్లో టీవీకే గెలిచింది. కానీ రెండు చోట్ల విజ‌య్ గెల‌వ‌డం వ‌ల్ల ఓ సీటును ఆయ‌న ఖాళీ చేశారు. దీంతో ఆ పార్టీ సంఖ్య 107కు చేరింది. ఇక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు అయిదు సీట్లు ద‌క్కాయి. ఆ పార్టీ ఇప్ప‌టికే ఓపెన్‌గా విజ‌య్‌కు మ‌ద్ద‌తు ప‌లికింది. ఈ అంశంలో కాంగ్రెస్‌పై డీఎంకే ఆగ్ర‌హంతో ఉన్న‌ది. ఇక రెండేసి సీట్లు గెలిచిన సీపీఐ, సీపీఎం పార్టీలు త‌మ మ‌ద్దతును ప్ర‌క‌టించాయి. దీంతో 234 స్థానాలు ఉన్న త‌మిళ‌నాడు అసెంబ్లీలో టీవీకే కూట‌మి సంఖ్య 116కు చేరింది. మ్యాజిక్‌ మార్క్ 117 సీట్లు కావ‌డం వ‌ల్ల విజ‌య్ పార్టీకి మ‌రో సీటు త‌క్కువ‌ప‌డింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News