అనుభవించిన బాధల దెబ్బలు
అనవసరంగా పడిన అపనిందలు
బహు దూరమైన ప్రేమ బంధాలు
బాధ పెట్టిన దయలేని మనుషులు
కోల్పోయిన నమ్మకాల గురుతులు
మోసపోయిన క్షణాల రక్తమరకలు
ఏరుదాటాక తెప్ప తగిలేసే నరులు
సంతోషాన్ని హరించ చూసే ఈర్ష్యలు
అవసరానికే పుట్టుకొచ్చే నకిలీ ప్రేమలు
మాయమైన మనసున్న మనషులు
మనసు నిండా పెట్టుకున్న ఆశలు
పోగొట్టుకున్న విలువైన జీవిత క్షణాలు
ఇవే కదా నేను వెనక్కి చూస్తే..
కదిలించేవి, కలత చెందించేవి !
- Advertisement -
