Wednesday, April 22, 2026
Homeఅంతర్జాతీయంVandalism | ఏసుక్రీస్తు విగ్రహం ధ్వంసం..

Vandalism | ఏసుక్రీస్తు విగ్రహం ధ్వంసం..

  • చర్యలు తీసుకుంటాం అన్న ఐడీఎఫ్..

ద‌క్షిణ లెబ‌నాన్‌లో ఇటీవ‌ల‌ ఇజ్రాయెల్ ద‌ళాలు గ్రౌండ్ ఆప‌రేష‌న్ చేశాయి. అయితే ఆ స‌మ‌యంలో ఏసు క్రీస్తు విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన ఓ ఫోటో రిలీజైంది. ఇజ్రాయిలీ సైనిక దుస్తుల్లో ఉన్న ఓ వ్య‌క్తి.. ఏసు క్రీస్తు విగ్ర‌హం త‌ల‌ను ప‌గుల‌గొట్టాడు. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే ఆ ఫోటోపై ఇజ్రాయిలీ ర‌క్ష‌ణ ద‌ళాలు క్లారిటీ ఇచ్చాయి. ఏసు విగ్ర‌హాన్ని సుత్తెతో ధ్వంసం చేస్తున్న‌ట్లుగా రిలీజైన ఫోటో నిజ‌మైందే అని ఐడీఎఫ్ పేర్కొన్న‌ది.

అయితే ఎవ‌రు ఆ చ‌ర్య‌కు పాల్ప‌డ్డారో తెలుసుకుని , వారిపై చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది. దీనిపై ప్ర‌క‌ట‌న కూడా జారీ చేసింది. సోష‌ల్ మీడియాలో ఆ ఫోటో వైర‌ల్ కావ‌డ‌గంతో, ఐడీఎఫ్ ప్ర‌తినిధి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ నాద‌వ్ సోషాని త‌న ఎక్స్ అకౌంట్‌లో స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై మిలిట‌రీ ద‌ర్యాప్తు చేప‌డుతుంద‌న్నారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ఏసు క్రీస్తు విగ్ర‌హాన్ని ఓ ఇజ్రాయిలీ సైనికుడే ధ్వంసం చేస్తున్న‌ట్లుగా ఉంద‌ని ఐడీఎఫ్ చెప్పింది. చాలా సున్నిత‌త్వంతో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామ‌ని, ఆ సైనికుడి ప్ర‌వ‌ర్త‌న తీరును ఖండిస్తున్న‌ట్లు ఐడీఎఫ్ వెల్ల‌డించింది.

- Advertisement -

ద‌క్షిణ లెబ‌నాన్‌లోని డేబెల్ క్రైస్త‌వ గ్రామంలో ఆ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న హిజ్‌బుల్లాను టార్గెట్ చేస్తూ అక్క‌డ ఉన్న క‌మ్యూనిటీని ఐడీఎఫ్ చుట్టుముట్టింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల నార్త‌ర్న్ క‌మాండ్ ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు మిలిట‌రీ అధికారి చెప్పారు. ఏసు క్రీస్తు విగ్ర‌హం ఎక్క‌డ ఉందో, ఆ స్థానంలో మ‌ళ్లీ విగ్ర‌హాన్ని స్థాపించే ప్ర‌క్రియ నార్త‌ర్న్‌క‌మాండ్ చూసుకుంటుంద‌ని ఇజ్రాయిలీ మిలిట‌రీ చెప్పింది. ఆ ఘ‌ట‌న సిగ్గుచేటు అని, దాని ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News