Friday, April 10, 2026
HomeజాతీయంPUC Fine | ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్..

PUC Fine | ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్..

  • రాజస్థాన్ లో ఓ పోలీస్ అధికారి వింత పోకడ..

రాజస్థాన్‌ లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. కాలుష్యానికి ఏమాత్రం కారణంకాని ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేదంటూ ఓ పోలీసు అధికారి చలాన్ విధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో పోలీసుశాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళ్తే..

నాగౌర్ జిల్లాలో ఓ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఆపారు. కారు అద్దాలకు సన్‌షేడ్స్ ఉన్నాయని మొదట రూ.200 జరిమానా విధించారు. ఆ తర్వాత పీయూసీ సర్టిఫికెట్ చూపించమని అడగ్గా.. ఎలక్ట్రిక్ వాహనానికి అది అవసరం లేదని కారు యజమాని వాదించారు. అయినప్పటికీ అధికారి వినిపించుకోకుండా పీయూసీ లేనందుకు మరో రూ.1,500 చలాన్ విధించారు.

- Advertisement -

ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కారు యజమానితో వాగ్వాదం జరిగిన గందరగోళంలో పొరపాటున పీయూసీ చలాన్ జారీ చేశామని అంగీకరించారు. ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని, పొరపాటున వేసిన ఫైన్‌ను సిస్టం నుంచి రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ నుంచి పూర్తి మినహాయింపు ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News