Friday, April 3, 2026
Homeనల్లగొండMothkur | మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా..

Mothkur | మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా..

  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

రాబోయే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూర్ నియోజకవర్గ సాధన కోసం ఈ ప్రాంత బిడ్డగా తాను ముందుంటానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.గురువారం మున్సిపల్ కేంద్రంలోని ఎల్.ఎన్ గార్డెన్ హాల్ లో మోత్కూర్ నియోజవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో మోత్కూర్, గుండాల, అడ్డగూడూరు, ఆత్మకూర్ మండలాలకు చెందిన అన్ని రాజకీయ పక్షాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే సామెల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ తాను ఈ ప్రాంతంలో పుట్టి,ఇక్కడే చదివానని, ఈ ప్రాంతం పై మక్కువతో మోత్కూర్ నియోజకవర్గ సాధన కోసం రాజకీయాలకతీతంగా కృషి చేసినందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు.గతంలో నియోజకవర్గాల పునర్విభజన లో మోత్కూర్,అడ్డగూడూర్ మండలాలు తుంగతుర్తి నియోజకవర్గంలో కలవగా,ఆత్మకూరు, గుండాల మండలాలు ఆలేరు నియోజకవర్గంలో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి, రాజకీయ ఆస్తిత్వం కొంతమేరకు దెబ్బతిందన్నారు.

- Advertisement -

ఇకనైనా మోత్కూర్ నియోజకవర్గం సాధించుకునేందుకు మంత్రులు,సీఎం రేవంత్ వద్దకు తన ఆధ్వర్యంలో తీసుకెళ్లి స్వయంగా ఒప్పించి నియోజకవర్గాన్ని సాధిద్దాం అన్నారు.ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు,ఉద్యమ కారులు,పాత్రికేయులు, పలు సంఘాల నాయకులు నియోజకవర్గ సాధన పై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ అనంతరం డీ లిమిటేషన్ కమిటీ తో పాటు ఎమ్మెల్యే, ఎంపీ,కలెక్టర్,కేంద్ర మంత్రులకు,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వం కి వినతి పత్రాలు అందించాలన్నారు. త్వరలోనే కార్యాచరణ రూపొందించి నియోజకవర్గ సాధనలో ప్రజలను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సీనియర్ జర్నలిస్టు కాయితాల నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి,మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు,మాజీ మార్కెట్ చైర్మన్ లు చిప్పలపల్లి మహేంద్రనాధ్, మందడి రామకృష్ణారెడ్డి,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ రెడ్డి,ప్రముఖ న్యాయవాది రహీం,తెలంగాణ ఉద్యమ గేయ రచయితలు అభినయ శ్రీనివాస్,కోదారి శ్రీనివాస్,అఖిలపక్షం నాయకులు ఫైళ్ల సోమిరెడ్డి, వంగాల సత్యనారాయణ, డా.గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి,మర్రి అనిల్, ధర్మేందర్ రెడ్డి,గుజ్జ సోమనర్సయ్య,ఎం డి.ఖలీల్,పొన్నెబొయిన రమేష్,జంగ శ్రీను,కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,గుండగొని రామచంద్రు,ఎన్ జోజి, యాణాల దామోదర్ రెడ్డి, చెడే చంద్రయ్య,బొల్లు యాదగిరి,బుర్రు అనిల్,రాజు,సత్యం గౌడ్,బుర్ర శ్రీనివాస్,ఎడ్ల నరేష్,బొట్టు అబ్బయ్య,కురాకుల వెంకన్న,సురారం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News