Wednesday, March 18, 2026
HomeసినిమాMotivation | నేదునూరి మాట

Motivation | నేదునూరి మాట

పట్టుదల ఆత్మవిశ్వాసం
ఆయుధమైతే
అభివృద్ధి సాధ్యమౌతుంది

మనిషి ఆలోచనల పుట్ట
ఒక ఆలోచన తర్వాత
మరో ఆలోచన జనిస్తుంది

- Advertisement -

ఆలోచనలు పరస్పరం
పోటీ పడతాయి
ఆలోచనలు ప్రత్యామ్నాయాలు

మనిషి ఇతరులతో
పోల్చుకోవడం
తన స్థాయికి మించి
పోటీపడడం

కోరికల సాధనకు
షార్ట్ కట్ పద్ధతులు
పాటిస్తూ చిక్కులో
చిక్కుకు పోవడం

అమలు కాని
ఆలోచనలతో
ఉక్కిరి బిక్కిరై
మనసును
ఆందోళనలోకి నెట్టి
పనులను వాయిదావేస్తూ
తన చేతగాని తనాన్ని

నిరంతర ఆలోచనలతో
కప్పి పుచ్చుకొని
కంగారు బాటలో
తమ జీవితాన్ని
సాగతీస్తున్నాడు

చెల్లని రూపాయికి
గీత లెక్కువ
చాతగాని వానికి
మాటలెక్కువ

వంద ఆలోచనలతో
ఉన్న వారి కంటె
తనకు కలిగిన
మామూలు ఆలోచన
అమలులో చిత్తశుద్ధి
ప్రదర్శిస్తే ఆవ్యక్తికే
ఫలితం దక్కుతుంది

మామూలు ఆలోచనలతో
కార్యాచరణ మొదలు
పెట్టినవారే
సమాజంలో ఎంతో కొంత
మార్పు తీసుకొస్తారు
వారినే సమాజం గుర్తిస్తుంది

తన కొరకు కాకుండా
పరుల హితమే
పరమావధిగా
జీవించే వారే
విజయులుగా
చరిత్రలో
చిరస్మరణీయులుగా
నిలిచిపోతారు

అతిగా ఆలోచిస్తూ
చేతులుముడుచుకొని
కూర్చోకుండా
చిన్న పనైనా తక్షణమే
మొదలు పెట్టండి

వేల మైళ్ల ప్రయాణం
మొదటి అడుగుతోనే
మొదలౌతుంది

ఎవరో వస్తారని
ఏదో చేస్తారని ఆశ
పడకుండా

స్వయం సంకల్పశక్తితో
అడుగు ముందుకేయాలి

అవరోధాలను అవకాశాలుగా
మలుచుకొని మార్పుకు
మనమే మార్గదర్శులం కావాలి

లక్ష్యసాధనలో పట్టుదలే
పెట్టుబడిగా సహనమే
మార్గంగా
ప్రతిభ ఆత్మవిశ్వాసమే
ఆయుధమైతే
వృద్ధి అభివృద్ధి
చేరువవుతుంది

నూతనఆవిష్కరణలతో
జగతి గతిని మార్చిన
జ్ఞాన కేంద్రంగా ఉత్పత్తి
కేంద్రంగా

సంపద సృష్టిలో
సమతను పాటిస్తూ
పేదరికాన్ని నిరుద్యోగాన్ని
పారదోలే వికసిత
భారత్ ను నిర్మిద్దాం

గుణాత్మమార్పులతో
ఉత్పత్తి ఉత్పాదకత
ఉపాధి వికసించి
ఆర్థికాభివృద్ధితో
జీవన ప్రమాణాలు
ఉద్ధీపనమై
ఆర్థిక వెలుగుల
ఆలంభణలతో
శక్తి వంతమైన
ఆర్థిక సౌథాన్ని నిర్మిద్దాం
విశ్వ గురువుగా
భారత్ ను
నిలబెడుదాం.

  • నేదునూరి కనకయ్య
- Advertisement -
RELATED ARTICLES

Latest News