HomeసినిమాG.O.A.T | గోట్ మూవీ సెన్సారు పూర్తి

G.O.A.T | గోట్ మూవీ సెన్సారు పూర్తి

ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌.

GOAT Movie UA Certificate And Release Date Announcement02

ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం తాజాగా సెన్సారును పూర్తిచేసుకుంది. సెన్సారు వాళ్లు ఈచిత్రానికి యుబైఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.

- Advertisement -
GOAT Movie UA Certificate And Release Date Announcement01

నిర్మాత మాట్లాడుతూ ప్ర‌స్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

GOAT Movie UA Certificate And Release Date Announcement0

సుడిగాలి సుధీర్‌, దివ్యభారతి, సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, నేపథ్య సంగీతం: మణిశర్మ, డీఓపీ: ర‌సూల్ ఎల్లోర్‌, ఆడిషనల్‌ డీఓపీ: సన్నీ కూరపాటి, ఎడిటర్‌: విజయ్‌ ముక్తవరపు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ : రాజీవ్ నాయర్, , కో ప్రొడ్యూస‌ర్‌: సమైరా రెడ్డి.ఎన్‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: ప్ర‌సూన మండ‌వ‌, దర్శకత్వం: వేదవ్యాస్‌, నిర్మాత: చంద్రశేఖర్‌ మొగుళ్ళ

- Advertisement -
RELATED ARTICLES

Latest News