Thursday, March 26, 2026
Homeఅంతర్జాతీయంIranian Warship | ప్రమాదం అంచున ఇరాన్ నౌక..

Iranian Warship | ప్రమాదం అంచున ఇరాన్ నౌక..

  • శ్రీలంక సముద్ర తీరంలో మరో యుద్ధనౌక..

ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌకను శ్రీలంక తీరంలో అమెరికన్ సబ్‌మెరైన్ బుధవారం పేల్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు ఇంకో ఇరాన్ నౌక ప్రమాదపు అంచున ఉంది. ఇరాన్‌కు చెందిన మరో యుద్ధనౌక శ్రీలంక తీరంలో ఉంది. దీంతో ఈ నౌకను కూడా అమెరికా పేల్చేస్తుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. శ్రీలంక మంత్రి నలిందా జయతిస్సా ఈ అంశంపై స్పందించారు.

100 మంది సిబ్బందితో కూడిన ఇరాన్ నౌక తమ దేశ జలాలకు దగ్గర్లోనే ఉందని నలిందా ప్రకటించారు. ఈ నౌకను కూడా ముంచేస్తారేమో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నౌకలోని సిబ్బందిని రక్షించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. దీనిపై శ్రీలంక ఎంపీ నమాల్ రాజపక్స మాట్లాడుతూ..

- Advertisement -

ఆ నౌకకు సంబంధించిన సిబ్బంది తమ పోర్టు నుంచి సాయం కోసం అడిగారని, దీనికోసం చర్చలు జరుపుతున్నామని, అనుమతి మంజూరుపై ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. ఇరాన్ నౌకకు సాయం చేసి రక్షించే అంశంపై తమ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నామని లేకుంటే గతంలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సందర్భంగా అప్పటి శ్రీలంక ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అవలంభిస్తామని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News