HomeసినిమాUstaad Bhagat Singh | ముందుగానే పవర్ స్టార్ తుఫాన్..

Ustaad Bhagat Singh | ముందుగానే పవర్ స్టార్ తుఫాన్..

  • మార్చి 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

థియేటర్లో పవర్ స్టార్ తుఫాన్ కాస్త ముందుగానే రాబోతోంది. సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Ustaad Bhagat Singh Release Date Preponed To March 192

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న మరో భారీ ఎంటర్‌టైనర్ ఇది. గతంలో ‘గబ్బర్ సింగ్’తో వీరు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించారు. ఆ మ్యాజిక్‌ను తిరిగి సృష్టించడానికి, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరిచిపోలేని థియేటర్ అనుభవాన్ని అందించడానికి ఈ ద్వయం సిద్ధమవుతోంది.

- Advertisement -

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నేపథ్య సంగీతం బాధ్యతలను ఎస్. తమన్ కు అప్పగించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రేక్షకులను డ్యాన్స్ చేయిస్తే, తమన్ తన నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళనున్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా పనులు సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరస్పర చర్చల అనంతరం సినిమా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పు చేయడం జరిగింది.

‘గబ్బర్ సింగ్’ తరువాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రచార చిత్రాలు సంచలనంగా మారి, అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతూ భారీ బజ్ సృష్టించాయి. ‘దేఖ్ లేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి.

Ustaad Bhagat Singh Release Date Preponed To March 19

బ్లాక్‌బస్టర్ కలయికలో వస్తున్న ఈ సినిమా అనుభవాన్ని సంగీత ద్వయం దేవి శ్రీ ప్రసాద్, ఎస్. తమన్ మరోస్థాయికి తీసుకొని వెళ్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది అభిమానులకు ఒక గొప్ప వేడుకగా, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా నిలవబోతోంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి కాస్త ముందుగానే మార్చి 19న థియేటర్లలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అడుగుపెట్టనుంది.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్ తదితరులు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య సంగీతం: ఎస్. తమన్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

- Advertisement -
RELATED ARTICLES

Latest News