Tuesday, February 24, 2026
Homeఆరోగ్యంCoffee | కాఫీ తాగితే మతిమరుపు రోగం తగ్గిపోతుంది..

Coffee | కాఫీ తాగితే మతిమరుపు రోగం తగ్గిపోతుంది..

  • వయసు పెరుగుతున్నవారికి కాఫీ ఒక దివ్యమైన ఔషధం..

మధ్యాహ్నం వేళ ఆవరించే మగతను వదిలించుకోవాలన్నా, పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలన్నా.. చాలామందికి కాఫీనే మొదటి చాయిస్‌. అయితే కాఫీ ప్రియులకు ఇప్పుడు సైన్స్‌ ఒక తీపి కబురు చెప్పింది. రోజూ కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో మతిమరుపు వచ్చే అవకాశాలు తకువగా ఉన్నాయని తాజాగా ఒక పరిశోధనలో తేలింది. ఇది ఏదో ఒకట్రెండు రోజులు చేసిన పరిశోధన కాదు..

ఏకంగా 37 ఏళ్ల పాటు సుమారు 1.3 లక్షల మంది ఆరోగ్య అలవాట్లను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు. వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు మందగించడం, ఆలోచనా సామర్థ్యం తగ్గడం వంటి న్యూరో డీజెనరేటివ్‌ సమస్యలను ఎదురోవడంలో కెఫీన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

- Advertisement -

ఈ అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వారు వెల్లడించారు. ఈ ప్రయోజనాలన్నీ కేవలం కెఫీన్‌ ఉన్న కాఫీ లేదా టీ తాగినప్పుడే కనిపిస్తాయి. కెఫీన్‌ లేని కాఫీ తాగిన వారిలో ఇలాంటి మార్పులేవీ కనిపించలేదు. కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజూ పరిమితంగా తాగే వారికి జ్ఞాపకశక్తి సమస్యలు తకువగా ఉన్నాయని, వారు కాగ్నిటివ్‌ పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచారని ఈ నివేదిక వెల్లడించింది. కాఫీ మంచిది కదా అని గంటకో కప్పు తాగేస్తే ప్రయోజనం చేకూరకపోగా, నష్టం వాటిల్లుతుంది.

రోజుకు రెండు మూడు కప్పుల కంటే ఎకువ కాఫీ తాగడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలేమీ ఉండవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్ని ఒక మ్యాజిక్‌ మందులా కాకుండా ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు. మరోవైపు మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కాఫీ తాగితే సరిపోదు. జీవనశైలిలో మార్పులు కూడా ముఖ్యమే. అందుకోసం కంటినిండా నిద్ర పోవడం, పోషకాహారం తీసుకోవడంతోపాటు రోజూ వ్యాయామం చేయాల్సిందేనని నిపుణులు సలహా ఇస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News