Monday, February 23, 2026
Homeఅంతర్జాతీయంRussia-Ukraine | నాలుగేళ్లకు చేరుకున్న రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం..

Russia-Ukraine | నాలుగేళ్లకు చేరుకున్న రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం..

  • పుతిన్ ఎప్పుడో మూడవప్రపంచ యుద్దాన్ని మొదలు పెట్టాడన్న జిలెన్ స్కీ..

ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం నాలుగేళ్ల‌కు చేరుకున్న‌ది. 2022 ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ఉక్రెయిన్‌పై ర‌ష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడో మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టార‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఓ అంత‌ర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ర‌ష్యాపై కాలుదువ్వ‌డాన్ని స‌మ‌ర్ధించుకున్న జెలెన్‌స్కీ.. తామేమీ యుద్ధం నుంచి విర‌మించ‌డం లేద‌న్నారు.

ఈ యుద్ధంలో తాము విజేత‌లుగా నిలుస్తామ‌ని జెలెన్‌స్కీ అన్నారు. కాల్పుల విర‌మ‌ణ పాటించాల‌ని పుతిన్ చేసిన డిమాండ్‌ను ఆయ‌న కొట్టిపారేశారు. వేల మంది సైనికులు మృతిచెందిన త‌ర్వాత త‌మ వ్యూహాత్మ‌క స్థానాల‌ను ర‌ష్యా వ‌దులుకున్న‌ట్లు జెలెన్‌స్కీ చెప్పారు. పుతిన్ ఎప్పుడో మూడ‌వ ప్ర‌పంచ యుద్ధాన్ని ప్రారంభించార‌ని, దీన్ని అడ్డుకోవాలంటే ర‌ష్యాపై తీవ్ర‌మైన సైనిక‌, ఆర్థిక వ‌త్తిడి తీసుకురావాల్సి ఉంటుంద‌న్నారు.

- Advertisement -

పుతిన్ ఎప్పుడో మూడ‌వ ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టిన‌ట్లు న‌మ్ముతున్నాన‌ని, ఆయ‌న ఎంత భూభాగాన్ని ఆక్ర‌మిస్తారు, ఆయ‌న్ను ఎలా అడ్డుకోవాల‌న్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని, ప్ర‌పంచంపై ర‌ష్యా త‌న పెత్తాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు జెలెన్‌స్కీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News