Monday, February 16, 2026
Homeవరంగల్‌Mulugu | ములుగు మున్సిపల్ పీఠంపై ఎగిరిన కాంగ్రెస్ పార్టీ జెండా

Mulugu | ములుగు మున్సిపల్ పీఠంపై ఎగిరిన కాంగ్రెస్ పార్టీ జెండా

  • తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం
  • పోరాడి ఓడిన బారసా పార్టీ
  • 20 వార్డుల్లో 12 కాంగ్రెస్,5 బారసా ,ఇద్దరు ఇండిపెండెంట్ లు,భాజపా నుంచి ఒకరు

ములుగుజిల్లా కేంద్రంగా నూతనంగా ఏర్పడ్డ ములుగు మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం సాయంత్రం ఓట్లు లెక్కింపు అనంతరం వెలువడగా ములుగు మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసంచేసుకుంది. మొత్తానికి మంత్రి సీతక్క ఇలాఖాలో కాంగ్రెసు పార్టీ ఘన విజయాన్ని నమోదుచేసుకుoది.మొత్తం 20 వార్డుల్లో 12 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు,5 బారసా అభ్యర్థులు,ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఒకరు భాజపా అభ్యర్థులు గెలుపొందారు. చైర్మన్ పదవిని చివరికి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మైన్ పీఠంపై కాంగ్రెస్ పార్టీజెండారెపరేపలాడనుంది.ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి.

1వ వార్డు ఎస్టీ మహిళ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలోత్ పద్మ విజయం సాధించారు.
2వ వార్డు ఎస్ సి జనరల్ రిజర్వేషన్ లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి కోగిల లక్ష్మీ విజయం సాధించారు.
3వ వార్డు జనరల్ మహిళ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత యాసం విజయం సాధించారు.
4వ వార్డు జనరల్ మహిళ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుంటోజు పావని విజయం సాధించారు.
5వ వార్డు ఎస్ సి మహిళ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుగ్గిళ్ళ దివ్య విజయం సాధించారు.
6వ వార్డు బి సి జనరల్ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతనిప్పుల చంద్రకళ విజయం సాధించారు.
7వ వార్డు జనరల్ రిజర్వేషన్ లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి బైకని సునీత విజయం సాధించారు.
8వ వార్డు జనరల్ మహిళ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి లో నల్లెల స్వాతి విజయం సాధించారు.
9వ వార్డు జనరల్ మహిళా రిజర్వేషన్ లో స్వతంత్ర అభ్యర్ధి గండ్రకోట వాణి విజయం సాధించారు.
10వ వార్డు జనరల్ మహిళా రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గజ్జెల సుష్మిత విజయం సాధించారు.
11వ వార్డు బి సి జనరల్ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కేశట్టి నవీన్ విజయం సాధించారు.
12వ వార్డు జనరల్ రిజర్వేషన్ లో స్వతంత్ర అభ్యర్ధి పోరిక రాజు విజయం సాధించారు.
13వ వార్డు ఎస్ సి జనరల్ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సిలువేరు సాంబయ్య విజయం సాధించారు.
14వ వార్డు జనరల్ మహిళ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఆసియా షాహిన్ విజయం సాధించారు.
15 వార్డు బి సి మహిళ రిజర్వేషన్ లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి రేసోజు పద్మ విజయం సాధించారు.
16 వార్డు జనరల్ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మహమ్మద్ కుతుబుద్దీన్ విజయం సాధించారు.
17 వార్డు బి సి జనరల్ రిజర్వేషన్ లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి భారత్ కుమార్ గోనెల విజయం సాధించారు.
18 వార్డు బి సి విమెన్ రిజర్వేషన్ లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి బైకని అనూష విజయం సాధించారు.
19 వార్డు జనరల్ రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఓం ప్రకాష్ విజయం సాధించారు
20 వార్డు ఎస్ టి జనరల్ రిజర్వేషన్ లో బి జె పి పార్టీ అభ్యర్ధి కొత్త సురేందర్ విజయం సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News