Homeరంగారెడ్డిChennapuram | మంజీరా పైప్ లైన్ లీక్‌తో చెన్నాపురం చౌరస్తా జలమయం

Chennapuram | మంజీరా పైప్ లైన్ లీక్‌తో చెన్నాపురం చౌరస్తా జలమయం

చెన్నాపురం చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం మంజీరా పైప్ లైన్ లీక్ కావడంతో భారీగా నీరు ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. పైప్ లైన్ నుండి వెలువడుతున్న నీటి ధార రహదారులన్నింటినీ నదులను తలపించేలా మార్చడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకస్మాత్తుగా పెద్ద ఎత్తున నీరు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Manjeera Pipeline Leak Floods Chennapuram Intersection2

ఇదే పరిస్థితి కొనసాగితే సమీప కాలనీలు జలమయం అయ్యే ప్రమాదం ఉందని, ఇళ్లలోకి నీరు చేరితే భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ కుదేలు అవుతోంది, రాకపోకలు మందగిస్తున్నాయి.

- Advertisement -
Manjeera Pipeline Leak Floods Chennapuram Intersection1

ఇంతటి పరిస్థితి నెలకొన్నా జలమండలి అధికారులు, గ్రేటర్ హైదరాబాద్ కీసర సర్కిల్ అధికారులు వెంటనే స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే లీకేజీని నియంత్రించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News