Tuesday, March 3, 2026
Homeసాహిత్యంTribute | రెక్కలు ముక్కలు చేసుకుని పునాదులు వేసింది మనమే

Tribute | రెక్కలు ముక్కలు చేసుకుని పునాదులు వేసింది మనమే

రెక్కలు ముక్కలు చేసుకుని నవ నాగరికత నిర్మాణానికి పునాదులు వేసింది మనమే కదా..!
పొట్టకూటి కోసం వలసవాదుల్లాగా వలస పోవడం ఎందుకు..?
కులమతాల మాటలు గారడితో అల్లుకున్న భావజాల రాబందువు అది దాని రెక్కల కింద నీడ కోసం చొరబడ్డావ్..
అది నిన్ను పీకు తినకుండా ఊరుకుంటుందా..?
సబ్బండ శ్రామిక ఉత్పత్తికులాల్లారా ఇదిగో మన వాటా గుంజుకుందాం రండి..!
అవును..

ఈ దారంతా పల్లేరు కాయల ముళ్ళ పొదలతో అల్లుకున్న విష బీజాలే
ముట్టుకుంటే అంటుకునే అగ్గి మంటలే
దారి నిండా పరచుకున్న ముళ్ళ పొదల్ని కూకట్వేలతో పీకేస్తా..
దహించి వేసే అగ్నిశికలాల్ని సైతం నా రెక్కలతో ఆర్పేస్తా..
సబ్బండ కులాలకు దారి చూపే కాగడనౌతా..
ఉత్పత్తి కులాలకు ఊతం నేనౌతా..
పిడికిలెత్తి గర్జిస్తూ జై బీసీ నినాదానికి ఊపిరిపోస్తా..

- Advertisement -

ఒక లెజెండరీ రచయిత్రి
తెలంగాణ దాతి
సబ్బండ శక్తి
ఎడ్ల కచ్చరంపై ఎగిరే ముల్లు కర్ర
ఎనుగరకు ఏలాడే ఉల్లిగడ్డల మూట
కమ్మరి కొలిమిలో మండే నిప్పు కనిక
కుమ్మరి కుండలో వండిన సలిపువ్వ
సాకలి బట్టల మూట
మంగలి కత్తి వడ్డెర సుత్తి
గొల్ల కురుమల గొంగడి మోకు గజ్జల సవ్వడి
లందలు పుట్టిన ఎల్లోవ తల్లి
మా ఇంటి ఆడబిడ్డ లలితవ్వ
శతకోటి శనార్తులు దాసోజు లలితక్కకు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News