Friday, February 27, 2026
Homeనల్లగొండఆలేరు మున్సిపల్ పోరులో స్పీడ్ తగ్గిన కారు, అయోమయంలో క్యాడరు.

ఆలేరు మున్సిపల్ పోరులో స్పీడ్ తగ్గిన కారు, అయోమయంలో క్యాడరు.

  • ప్రచారంలో ఉత్సాహంగా ముందుకు కదులుతున్న క్యాడర్.
  • క్యాడర్ కు జోష్ ఇవ్వలేక పోతున్న అభ్యర్థులు నాయకులు

ఆలేరు మున్సిపల్ పట్టణ కేంద్రం బీఆర్ఎస్ పార్టీకి కంచు కోట. అలాంటి కంచుకోటలో బీఆర్ఎస్ బీటలు వారుతుందా, ఎవరో బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టడం లేదు స్వంత పార్టీ నేతలే బీఆర్ఎస్ కు బ్రేకులు వేసుకుంటున్నారు.. ఆలేరులో బీఆర్ఎస్ కు ఉన్న బలమైన క్యాడర్ క్రమక్రమంగా తగ్గుతుంది. బీఆర్ఎస్ లో సమన్వయ లోపం అంతర్గత పోరు తార స్తాయికి చేరి క్యాడర్ కు భరోసా ఇచ్చే నాయకులు కరువయ్యారు.ద్వితీయ శ్రేణి నాయకుల నుండి సామాన్య కార్యాకర్త వరకు ఎవరితో పనిచేయాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు.

మొట్ట మొదటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జండా ఎగరడంలో బీఆర్ఎస్ కార్యకర్తల అహర్నిశల శ్రమ పనితనం వెలకట్టలేనిది. మొదటి మున్సిపల్ ఎన్ని కల్లో ఎగిరేసిన బీఆర్ఎస్ జండా రెండవ సారి ఎగరడంపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి…. బలమైన అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ, ప్రచారంలో అభ్యర్థులు జోరు చూపించలేకపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకోలేక మల్లగుళ్లాలు పడుతున్నారు… అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ప్రచారంలో ప్రజలకు వివరించలేకపోతున్నారు.

- Advertisement -

దీనికి కారణాలు ఏమిటి. బీఆర్ఎస్ పార్టీ,అభ్యర్థులు అధికార పార్టీ హామీల పై విమర్శలు ఎక్కుపెట్టడం లేదనే చెప్పాలి. పోటీలో ఉన్న అభ్యర్థులు అధికార పార్టీకి జంకుతున్నారా.? ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన పార్టీ ఉద్యమాల సమయంలో ఉమ్మడి అంద్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన బేధరని బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పుడు ఎందుకు ఎదురేల్లి పోరాడ లేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.

పది యేండ్ల అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ,ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నారా.? 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడానికి సందిగ్ధంలో పడడానికి గల కారణాలు ఏమిటనేది ఎవరికి వారే విశ్లేషించుకోవాలి ? ఇకనైనా పార్టీ పెద్దలు మేలుకుని జరిగిన నష్టాన్ని పుడ్చే దిద్దుబాటు చర్యలు తీసుకుని కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపి ప్రచార జోరు చూపించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News