హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో(Harvard Business School) చదువుతున్న భారతీయ విద్యార్థుల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) Harvard Business School(HBS) క్యాంపస్‌ను ప్రత్యేకంగా సందర్శించి వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో నాయకత్వం, వృత్తిపరమైన అంశాలపై చర్చించారు. జీవిత అనుభవాల ఆధారంగా విజయ సాధనకు దోహదపడిన విషయాలను పంచుకున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్(Telangana Rising Vision)ను వివరించిన సీఎం.. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. విద్యార్థులు తమ మేధస్సు, గ్లోబల్ నెట్‌వర్క్‌ను ఇండియా వృద్ధికి వినియోగించాలని సూచించారు. హైదరాబాద్, తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పే బ్రాండ్ అంబాసిడర్లు(Brand Ambassadors)గా వ్యవహరించాలని కోరారు.
HBS | హెచ్‌బీఎస్‌ను సందర్శించిన సీఎం రేవంత్
- Advertisement -
RELATED ARTICLES
