సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(Harish Palvai).. సమ్మక్క సారలమ్మ(Sammakka Saaralamma)లకు మొక్కులు చెల్లించుకున్నారు. పెంచికల్పేట్ మండలంలోని గోంట్లపేట్ గ్రామంలో సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం తూకం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన దేవతల(Tribal Deities) కృప అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు భక్తు రాంచందర్, అన్నం రుక్మబాయి గణపతి, చప్పిడి రవి, బొట్టుపల్లి హరీష్ కృష్ణవేణి, నాయకులు ఘనపురం నాగేష్, చిలువేరు భాస్కర్, జునగరి మధుకర్, ప్రభాకర్, రాజన్న, వెంకన్న, బండి ప్రభాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
