Wednesday, March 4, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐNext-Gen Policy | దావోస్‌లో ‘నెక్‌స్ట్ జెన్’ విధానం ఆవిష్కరణ

Next-Gen Policy | దావోస్‌లో ‘నెక్‌స్ట్ జెన్’ విధానం ఆవిష్కరణ

దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘నెక్‌స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30′(Next-Gen Life Sciences Policy 2026–30)ని ఆవిష్కరించింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి ఈ పాలసీని ప్రపంచానికి పరిచయం చేశారు.
❇️ ఫార్మా, వ్యాక్సిన్, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రస్తుతం ఉన్న బలమైన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ 2030 కల్లా ప్రపంచ స్థాయిలోని టాప్-3 లైఫ్ సైన్సెస్ కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణను తీర్చిదిద్దడం ఈ పాలసీ లక్ష్యం.
❇️ రాష్ట్రంలో ప్రస్తుతం 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు, 250కి పైగా USFDA ఆమోదిత తయారీ కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో దాదాపు 3వ వంతు వాటా తెలంగాణదే. ఈ నేపథ్యంలో ‘నెక్‌స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30’ కేవలం ఉత్పత్తుల పరిమాణాలను పెంచుకోవడమే కాకుండా విలువల ప్రమాణాలు పెంపొందేలా, మరిన్ని ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణ నిలిచే అంశాలను పాలసీలో పొందుపర్చారు.
❇️ ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సిన్ల తయారీ, అత్యాధునిక పరిశోధనలు, అధునాతన బయో-మాన్యుఫ్యాక్చరింగ్, బయోలాజిక్స్, బయోసిమిలర్లు, ప్రెసిషన్ మెడిసిన్, పర్సనలైజ్డ్ థెరపీలు, డిజిటల్ హెల్త్, డయాగ్నస్టిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, క్లినికల్ రీసెర్చ్, గ్లోబల్ వాల్యూ & ఇన్నోవేషన్ సెంటర్లు తదితర అంశాలను ఈ పాలసీలో వ్యూహాత్మక రంగాలుగా పేర్కొన్నారు.
❇️ లైఫ్ సైన్సెస్ రంగంలో రాబోయే నాలుగేండ్లలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి 5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించేలా పాలసీ అంశాలను రూపొందించారు. అలాగే, జీనోమ్ వ్యాలీ విస్తరణ, మెడికల్ డివైసెస్ పార్క్, గ్రీన్ ఫార్మా సిటీ స్థాపన, 10 ఫార్మా విలేజ్‌ల అభివృద్ధి, బయో-ఇన్నోవేషన్, బయో-మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ద్వారా అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తారు. అదే సమయంలో, పర్యావరణహిత, జీరో-లిక్విడ్ డిశ్చార్జ్(ZLD) పారిశ్రామిక పద్ధతుల అమలును పాలసీలో ప్రధానంగా పేర్కొన్నారు.
❇️ పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతిస్తూ టాస్క్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వంటి సంస్థల సహకారంతో నూతనంగా తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఏర్పాటుకానుంది. నిబంధనల సరళీకరణ, TG-iPASS ద్వారా నిర్ణీత కాల పరిమితిలో అనుమతులు, స్టార్టప్‌లు, MSMEలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రత్యేక మద్దతు అందించడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా సులభతరమవుతుంది.
❇️ ‘నెక్‌స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30’ అమలు బాధ్యతను పరిశ్రమలు & వాణిజ్య శాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖలు పర్యవేక్షిస్తాయి. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ (TLSF) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News