Wednesday, March 4, 2026
HomeజాతీయంNitin Nabin | నితిన్ నబిన్.. నా బాస్: ప్రధాని మోదీ

Nitin Nabin | నితిన్ నబిన్.. నా బాస్: ప్రధాని మోదీ

ఈ రోజు నుంచి పార్టీ వ్యవహారాలకు సంబంధించి నితిన్ నబిన్(Nitin Nabin) తనకు బాస్(Boss) అని, తాను ఒక కార్యకర్త(Activist)ను మాత్రమేనని ప్రధాని మోదీ(PM Modi) చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి(Bjp National President)గా ఎన్నికైన నితిన్ నబిన్ మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రమాణస్వీకారం(Swearing In) చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీని ముందుకు నడిపించడంతోపాటు ఎన్డీయే మిత్రపక్షాల(NDA Allies)తో సమన్వయం చేసుకోవటం కూడా నితిన్ నబిన్ బాధ్యతేనని సూచించారు. నితిన్ నబిన్‌కి యువశక్తి, అపార అనుభవం రెండూ ఉన్నాయని ప్రధాని అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి నాయకత్వంలో బీజేపీ.. సున్నా నుంచి శిఖరాగ్రానికి ఎదిగిందని చెప్పారు. అనంతర కాలంలో పార్టీ పగ్గాలు చేపట్టిన ప్రతిఒక్కరి సేవలను మోదీ ప్రస్తావించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News