ఇండోర్(Indoor)లో ఆదివారం న్యూజిలాండ్(Newzealand)తో జరిగిన మూడో వన్డే(Third One Day)లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఒంటరి పోరాటం చేసినా ఇండియా ఓటమి(India Defeat) పాలైంది. కివీస్ 41 రన్నుల తేడాతో నెగ్గి 2-1 తేడాతో సిరీస్‌ను సైతం కైవసం(Series Loss) చేసుకుంది. కోహ్లీ 124 పరుగులు చేసి ఔటయ్యాడు. నితీష్, హర్షిత్ రాణాలు కూడా హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకుండాపోయింది. తొలుత టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది. న్యూజిలాండ్ 50 ఓవర్లలో 337 రన్నులు చేసింది. 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 46 ఓవర్లలో 296 రన్నులే చేసి ఆలౌట్ అయింది. కోహ్లీ వన్డేల్లో 54వ సెంచరీ(Centuary) చేయటం విశేషం. కివీస్ టీమ్‌లో మిచెల్, ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు.
Kohli | కోహ్లీ పోరాడినా.. ఓడిన ఇండియా..
- Advertisement -
RELATED ARTICLES

