మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆదివారం హుస్నాబాద్(Husnabad)లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దార్థ హైస్కూల్లో 2,3,14,15,16 వార్డులకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu) మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు & మహిళా సంఘాలకు రూ.కోటీ 13 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కును అందించారు.
హుస్నాబాద్ మునిసిపాలిటీ పరిధిలో మైనారిటీ మహిళలకు(Minority Women) కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. 57 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. హుస్నాబాద్ మునిసిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో 1,10,11,12,13 వార్డుల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను అందజేశారు.
18 ఏళ్లు పైబడిన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు కోటి 13 లక్షల వడ్డీలేని రుణాలు చెక్కును అందించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారుల(Free Electricity Beneficiaries) మహిళలకు పత్రాలను పంపిణీ చేశారు. హుస్నాబాద్ మునిసిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. స్వర్ణకారుల సంఘం భవనంలో హుస్నాబాద్ మునిసిపాలిటీలోని 8, 9, 18, 17, 19 వార్డుల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
3520 మంది మహిళలకు కోటీ 13 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు చెక్కును అందించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

