ఓటమంటే(Defeat) భయమేల?.. అనుభవానికది(Experience) వెల..
నిన్నటిని మరిపించేల.. నేటి అడుగు సాగాల..
గాయాలను మరవాల.. గమ్యం(Destination) గురుతుండాల..
బాధ(Pain) మరిచిపోవాల.. భవిత(Future) యాది కుండాల..
శత్రుత్వం(Enmity) మరిచేల.. స్నేహం(Friendship) నీది కావాల..
సాయం గుర్తుండాల.. అపాయం మాసిపోవాల..
మరుపన్నది ఓ కళ.. దాని మర్మం తెలుసుకోవాల..
చదువంటూ ఒకటుందని.. చరిత్ర గతిని మార్చునని..
పరీక్షలను దాటాలని.. ప్రశ్నలకు జవాబులని..
నేర్వాలని.. రాయాలని.. ఒకటి కాదు.. రెండు కాదు..
పదుల సార్లు మననం.. మతిమరుపుకు నిదర్శనం..
జ్ఞప్తి లేక.. యాది రాక.. నిరంతరం నీరసించు విద్యార్థులను చూశాక రుజువయ్యను ఇలా..
మరుపన్నది ఓ కళ.. దాని మర్మం తెలుసుకోవాల..
అయినవాడు ఇక లేడను.. జ్ఞాపకాల గునపాలు గుండెశెలిమి తవ్వుతుంటే..
బండెడంత నొప్పిని.. పంటి కింద దాచేస్తే..
కన్నీళ్లు అనే ఊట నుంచి నీటి వరద పారుతుంటే..
గొంతు ఎండిపోతుంటే.. హృదయం బరువెక్కుతుంటే..
మరువలేక.. మాసిపోక.. మనిషి పుట్టుక శాపమని..
బతికుండుట పాపమని.. అనిపించిన ప్రతిసారి..
వినిపించెను శబ్దమిలా..
మరుపన్నది ఓ కళ.. దాని మర్మం తెలుసుకోవాల..
కులం అని.. మతం అని.. ప్రాంతమని.. భాష అని..
కొట్టుకుంటు చావాలా?.. మనుషులం అని మరవాలా?..
అమ్మ చేతి ముద్ద తిని.. తొక్కి నాన్న భుజాలని..
ఎదిగాక మరవాలా?.. తల్లి పేగు తెగేలా..
ఎన్నో ప్రశ్నలకిలా.. దొరికింది జవాబులా..
మరుపన్నది ఓ కళ.. దాని మర్మం తెలుసుకోవాల..
- గడీల శ్రీకాంత్

