- సంక్రాంతి కానుకగా ఓయూ ఉత్తర్వులు
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంచుతూ విశ్వవిద్యాలయ యంత్రాంగం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా డీఏ విడుదల చేసిన నేపథ్యంలో,అదే నిర్ణయాన్ని ఓయూ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని గౌరవ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం అధికారులను ఆదేశించారు.ఈ డీఏ సవరణ జూలై 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది.బోధనా సిబ్బంది (UGC 2016 స్కేల్స్):42% నుంచి 46%కిబోధనా సిబ్బంది (UGC 2006 స్కేల్స్):221% నుంచి 230%కిబోధనేతర సిబ్బంది (RPS 2020):30.03% నుంచి 33.67%కిబోధనేతర సిబ్బంది (RPS 2015):68.628% నుంచి 73.344%కి డీఏ పెంపు చేశారు.

పెరిగిన డీఏను జనవరి 2026 జీతంతో కలిపి ఫిబ్రవరి 1, 2026న చెల్లిస్తారు.జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు.పదవీ విరమణ చేసినవారికి,టైమ్-స్కేల్ ఉద్యోగులకు బకాయిలను నెలవారీ వాయిదాలుగా చెల్లిస్తారు.మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు బకాయిలను ఒకేసారి చెల్లిస్తారు.ఈ డీఏ అమలుకు అవసరమైన నిధులను యూనివర్సిటీ బ్లాక్ గ్రాంట్, యూజీసీ/సంబంధిత ఏజెన్సీల ద్వారా సమకూరుస్తామని వీసీ తెలిపారు.

