Monday, January 19, 2026
EPAPER
Homeస్పోర్ట్స్Venkataswami | విజయవంతంగా ముగిసిన కాకా టోర్నీ

Venkataswami | విజయవంతంగా ముగిసిన కాకా టోర్నీ

కాకా(Kaka) వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్(Memorial Inter District) T20 క్రికెట్ టోర్నమెంట్(T20 Cricket Tournament) విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, HCA సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి విశేష సేవలందించిన దివంగత మహానేత కాకా వెంకటస్వామి స్మృతికి అంకితంగా ఈ టోర్నీని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు.

డిసెంబర్ 22 నుంచి జనవరి 17 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లు పాల్గొనగా క్రికెట్ అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 500 మంది క్రీడాకారులు, 105 మ్యాచ్‌లు ఈ టోర్నమెంట్ ప్రత్యేకతగా నిలిచాయి. హైదరాబాద్ జింఖానా మైదానంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి నిజామాబాద్ జట్టు విజేతగా ఖమ్మం జట్టు రన్నరప్‌గా నిలిచింది.

- Advertisement -

నిజామాబాద్ జట్టుకు రూ.5,00,000, ఖమ్మం జట్టుకు రూ.3,00,000, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.1,00,000 నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు నిజామాబాద్ జట్టుకు ట్రోఫీని అందజేసి అభినందించారు. వక్తలు మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి క్రీడల అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈ టోర్నమెంట్‌ను నిర్వహించామని తెలిపారు.

ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ తన తాత కాకా వెంకటస్వామి, తండ్రి వివేక్ చూపిన మార్గంలోనే ముందుకు సాగుతూ విశాఖ ఛారిటబుల్ ట్రస్ట్, విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా ఏటా ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాకా వెంకటస్వామి ఆదేశాల మేరకు అప్పట్లో హైదరాబాద్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సుమారు రూ.4.5 కోట్లు అందించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను అభినందిస్తూ మహిళల కోసం కూడా ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించాలని సూచించారు. దీనికి స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. మహిళలు–పురుషులు అనే తేడా లేకుండా క్రీడలకు పూర్తి ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు బస్సు, భోజనం వంటి అన్ని సదుపాయాలు కల్పించి టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. తెలంగాణలో అవసరమైన చోట్ల క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాత్ర అభినందనీయమని అన్నారు. కాకా వెంకటస్వామి స్మృతికి అర్హమైన రీతిలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయిలో ఘన విజయాన్ని సాధించిందని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News