మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(Kavvampalli Satyanarayana) బుద్ధి మారట్లేదని మాజీ ఎమ్మెల్యే(Former Mla) రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) విమర్శించారు. ఒకప్పుడు డెవలప్‌మెంట్(Development)కి కేరాఫ్ అడ్రస్(Care Of Address)గా మారిన నియోజకవర్గాన్ని ఇప్పుడు వివాదాల(Disputes)కు చిరునామాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు(Congress Party Activists) గూండాయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక దందా, కమీషన్లకు తెగిస్తూ మానకొండూర్‌కి చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడ్డారు. ఊటూరులో ఇసుక క్వారీ నడుపుతూ స్థానికులను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. శాసన సభ్యుడు కవ్వంపల్లిని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని ఎద్దేవా చేశారు. షాడో ఎమ్మెల్యే ఆగడాలకు అడ్డే లేకుండాపోతోందని ఫైర్ అయ్యారు.

