- శాంతియుత ర్యాలీలో పాల్గొన్న సీతాఫల్మండి కార్పొరేటర్ హేమ
- ర్యాలీని అడ్డుకుని అరెస్టు చేసి ముషీరాబాద్ స్టేషన్ కి తరలించిన పోలీసులు
- పోలీసుల దురుసు ప్రవర్తన తీరును ఖండించిన సామల హేమ
సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో నిర్వహించిన శాంతి ర్యాలీలో భాగంగా ఎంజీ రోడ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీతాఫలమండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమతో పాటు బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని డా. సామల హేమ ఆవేదన వ్యక్తం చేశారు.ర్యాలీకి ముందుగా అనుమతులు ఇచ్చి,అర్ధరాత్రి సమయంలో వాటిని రద్దు చేయడం అన్యాయమని ఆమె మండిపడ్డారు.శాంతియుతంగా నిర్వహించిన ర్యాలీపై అక్రమ అరెస్టులు సరికాదని,ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.మహిళ ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా పోలీసులు ఇష్టారీతిన వ్యవహరించారని,పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందని విమర్శించారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు విజయ,పింకీ,లక్ష్మి,గగన,లలిత,జ్యోతి,ప్రవళిక,సుజాత,భాగ్య,మణిమంజరి,సత్యవతి,పద్మ,అర్చన తదితరులు పాల్గొన్నారు.

