నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లోని మామిడిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు శనివారం జరిగిన 2వ విడత సీఎం కప్(CM Cup)-2025 టార్చ్ ర్యాలీ(Torch Rally)లో ఆర్మూర్ ఎమ్మెల్యే(Armor MLA) పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ(Telangana Sports Ministry) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యువత ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని విజేతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉజ్వలమైన భవిష్యత్ కోసం క్రీడలను ఒక సాధనంగా చేసుకోవాలని సూచించారు.
- Advertisement -

