Thursday, February 12, 2026
Homeక్రైమ్ వార్తలుCheater | నల్గొండలో చీటర్ అరెస్ట్

Cheater | నల్గొండలో చీటర్ అరెస్ట్

విదేశాల్లో ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల(Admissions to Educational Institutions) పేరుతో యువత నుంచి డబ్బు వసూలు చేసి మోసగిస్తున్న వ్యక్తిని నల్గొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుణ్ని ముప్పాళ్ల లీలాకృష్ణ(Muppalla Leelakrishna)గా గుర్తించారు. ఇతను ఏపీలోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామం అని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో మాల్ అనే ఊరిలో అదుపులోకి తీసుకున్నారు. తన కుమారుడికి ఫారన్ జాబ్(Foreign Job) ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బు తీసుకున్నాడని, తర్వాత ఆరా తీస్తే మోసపోయినట్లు తెలుసుకున్నానని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. వరంగల్ జిల్లాలోని యూత్ నుంచి దాదాపు రూ.85 లక్షలు వసూలు చేశానని లీలాకృష్ణ తమ విచారణలో ఒప్పుకున్నాడని నల్గొండ ఏఎస్పీ జి.రమేష్ తెలిపారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మూడు ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. లీలాకృష్ణ గతంలో విదేశాల్లో పనిచేసి వచ్చాడని, అక్కడి పరిచయాలను అడ్డం పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నాడని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News