Friday, February 27, 2026
Homeఆజ్ కీ బాత్Swami Vivekananda | ధైర్యవంతులకే కాలం కలిసొస్తుంది

Swami Vivekananda | ధైర్యవంతులకే కాలం కలిసొస్తుంది

యువతే(Youth) దేశ భవిష్యత్తు(Future of Country) అని చెప్పిన స్వామి వివేకానందుడి మాటలు నేటికీ, ఏనాటికైనా అనుసరణీయం, ఆచరణీయం. మేమేం చేయలేం అనే అపోహ వీడండి. నేనే భవిష్యత్ శిల్పి అనే ఆలోచనతో జీవితాన్ని(Life) కొత్త సంకల్పంతో ఆరంభించండి. పాలకుల(Rulers) చేయూత, యువత ఆత్మవిశ్వాసమే(Self Confidence) కవచం, ఆయుధం. కాలం(Time) అమూల్యం అంటూనే దాన్ని వృథా చేయడం ఆపండి. కాలం పిరికివారిని ఇంకా వెనక్కి నెట్టివేస్తుంది. ధైర్యవంతులను(Brave People) మరింత ముందుకు తోస్తుంది. కూలీ కైనా.. కుబేరుడికైనా.. రోజుకు ఇరవై నాలుగు గంటలే. వివేకానందుడి స్ఫూర్తితో యువత ఏకమైతే ప్రపంచాన్నే మార్చి అందరికీ మెరుగైన భవిష్యత్తును అందించగలరు. చిత్తశుద్ధితో చేసే వారి ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్షిద్దాం. ఫలితం.. సిద్ధమైన వారికే దక్కే బహుమతి!

  • మేదాజీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News