వెనెజువెలా అధ్యక్షుడు(President of Venezuela) నికోలస్ మదురో(Nicolas Maduro), ఆయన సతీమణిని అగ్రరాజ్యం అమెరికా నిర్బంధించడం(American Detention) పట్ల చైనా(China) తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. ఇది ఏకపక్షంగా వేధించటమేనని(Harassment) మండిపడింది. అమెరికా ఈ విధంగా వ్యవహరించటం ఈమధ్య కాలంలో ఎక్కువైందని పేర్కొంది. వరల్డ్ పోలీస్(World Police)గా లేదా ఇంటర్నేషనల్ జడ్జి(Internationa Judge)లా పెత్తనం చేసే అధికారం ఏ దేశానికీ లేదని తేల్చిచెప్పింది. బలప్రయోగాన్ని తాము ఎప్పుడూ సమర్థించబోమని హెచ్చరించింది. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని సూచించింది. ఒక దేశం తన ఇష్టాలను మరో దేశంపై రుద్దటం సరికాదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. ప్రస్తుతం అస్థిరంగా ఉన్న అంతర్జాతీయ పరిస్థితులపై గ్లోబల్ సొసైటీ ఫోకస్ పెట్టిందని తెలిపారు.
China | అమెరికాపై చైనా ఆగ్రహం
- Advertisement -
RELATED ARTICLES
