Thursday, February 12, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంAadab Effect | ఆదాబ్‌ కథనానికి స్పందించిన కొల్లూరు ట్రాఫిక్‌ పోలీసులు

Aadab Effect | ఆదాబ్‌ కథనానికి స్పందించిన కొల్లూరు ట్రాఫిక్‌ పోలీసులు

నల్లగండ్ల హుడా లేఔట్‌లోని మెడిప్లేస్‌ 100 ఫీట్‌ రోడ్‌పై శుక్రవారం ట్రాఫిక్‌ సమస్యపై ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రికలో ప్రచురితమైన కథనానికి వెంటనే స్పందించిన కొల్లూరు ట్రాఫిక్‌ విభాగం చర్యలు ప్రారంభించింది. ట్రాఫిక్‌ ఆర్‌ఐ అప్పల నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ సిబ్బంది శుక్రవారం సాయంత్రం ఈ ప్రాంతాన్ని పరిశీలించి రోడ్డుపై పార్కింగ్‌, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు, అనధికార వాహన నిలుపుదలల వల్ల తీవ్ర రద్దీ పెరుగు తోందని గుర్తించారు. ఈ సందఠరేగా వ్యాపార సంస్థలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

మీ ముంగిట రోడ్డుపై వాహనాలు నిలపరాదు, వినియోగదారుల కోసం తగిన పార్కింగ్‌ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించుకోవాలి అని ఆదేశించారు. ఫుట్‌పాత్‌లపై అనధికారంగా వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రజా రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తక్షణమే తొలగించాలి, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మెడిప్లేస్‌ 100 ఫీట్‌ రోడ్‌పై ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, ప్రజలు-వ్యాపారులు సహకరించాలని కొల్లూరు ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News