Saturday, March 21, 2026
Homeవరంగల్‌Collectorate | అట్టహాసంగా సాగిన నూతన సంవత్సర వేడుకలు

Collectorate | అట్టహాసంగా సాగిన నూతన సంవత్సర వేడుకలు

  • జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలా పనిచేయాలి.
  • వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య డాక్టర్ శారద.

వరంగల్ జిల్లా ప్రజలు సుభిక్షంగా జీవించడానికి ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేయుటకు భాగస్వామ్యులు అయినప్పుడే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. గురువారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్- డిఆర్డిఏ) ఉద్యోగుల తో పాటు వివిధ శాఖల ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్ సత్యసారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ ఆర్డిఓ సుమ, సీఈవో, డిఆర్డిఓ రామ్ రెడ్డి లకు పుష్పగుచ్చాల అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి మిఠాయి పంపించేశారు.

అనంతరం సెర్ప్, గ్రామీణ అభివృద్ధి సంస్థ, రెవిన్యూ శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తోపాటు వివిధ శాఖల 2026 నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీలను, ఆవిష్కరించారు. కలెక్టర్ సత్యసారద మాట్లాడుతూ… జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని, ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించే నూతన సంవత్సర వేడుకలు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు భారీగా తరలివచ్చి పోటాపోటీగా నూతన క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించడంతో కలెక్టరేట్ ప్రాంగణమంతా సంతోషాల సందడితో జాతర వాతావరణాన్ని తలపించింది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సెర్ప్ – జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, రెవెన్యూ, పోలీస్, విద్య వైద్య ఆరోగ్య వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యోగులు టీఎన్జీవో, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఉద్యోగ సంఘాల నాయకులు, ఆదరసంది, రాజీరు, కాందారి సారయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు గోలి కొమురయ్య, గూగులోత్ వెంకన్న డిఆర్డిఏ ఏపీ డి రేణుకా దేవి, వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు మర్రి దాసు అనిల్ కుమార్, రేవతి, వరలక్ష్మి, ఏ, సుధాకర్ శ్రీనివాస్, లవ కుమార్, వనమ్మ రంగు కిరణ్, సుధాకర్ రమేష్ రాజీర్, ఏలియా, శ్యాoసన్ మోహన్ బాబు రాజయ్య, రాజు, రమేష్, సుజాత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News