Thursday, March 26, 2026
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu | నూతన సంవత్సర శుభాకాంక్షలు

CM Chandrababu | నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు(NTR Bharosa Pensions) అందుకుంటున్న లక్షలాది మంది లబ్దిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు(New Year Wishes) తెలిపారు. కొత్త ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఒక రోజు ముందుగానే పింఛను సొమ్ము అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం(Kutami Government) ఏర్పడిన తర్వాత ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 వేల కోట్లకు పైగా పింఛన్ల కోసం ఖర్చు పెట్టామని చెప్పారు.

డిసెంబర్‌(December)కి సంబంధించి 63.12 లక్షల మందికి పింఛను ఇచ్చేందుకు రూ.2743 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. 1వ తేదీన పింఛను ఇవ్వాల్సి ఉన్నా కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందే 31వ తేదీనే మీ ఇళ్ల వద్ద పింఛన్ పంచే ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛను పంపిణీ మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమమని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News