కరీంనగర్, డిసెంబర్ 22(ఆదాబ్ హైదరాబాద్): బోయినపల్లి మండలం(Boyanapalle Mandal) స్తంభంపల్లి సర్పంచ్(Sarpanch)గా బొంగాని అశోక్ గౌడ్(Ashok Goud), పాలవర్గ సభ్యులు(Ward Members) సోమవారం ప్రమాణ స్వీకారం(Oath taking) చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రత్యేక అధికారి(Special Officer) హరీష్ నిర్వహించారు. ఉప సర్పంచ్ చంద్రగిరి అశోక్, వార్డు సభ్యులు శ్రీ మణి, కొట్టపెల్లి రమ్యశ్రీ, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, బొంగాని శ్రావణ్ కుమార్, అక్కనపల్లి మధు, అక్కనపల్లి కల్యాణ్, గంగదర గంగ జమున, చంద్రగిరి వెంకటేష్, ఎర్ర సువర్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్‌కి సన్మానం(Fecilitation) చేశారు.
- Advertisement -
