బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత(Brs Party Senior Leader), మాజీ మంత్రి(Former Minister), సిద్దిపేట ఎమ్మెల్యే (Siddipet Mla) తన్నీరు హరీష్‌రావు (Harish Rao) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ సరస్వతి పుత్రిక వైద్య విద్య కోసం ఆర్థిక సహాయం అందించటానికి సిద్దిపేటలోని తన ఇంటిని తాకట్టు పెట్టారు(House Mortgage). సిద్ధిపేట బిడ్డ మమతకు పీజీ ఎంట్రన్స్‌లో సీటు వచ్చినా ట్యూషన్ ఫీజులకు ఏటా రూ.7.50 లక్షలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం చెప్పింది. దీంతో.. బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితే గానీ రుణం మంజూరు చేయలేమని బ్యాంకర్లు పేర్కొన్నారు.
ఈ నెల 18న ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును తిరస్కరించే పరిస్థితి నెలకొనటంతో ఈ విషయాన్ని మమత తండ్రి కొంక రామచంద్రం.. హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో హరీష్‌రావు పెద్ద మనసు చాటుకున్నారు. సిద్దిపేటలోని స్వగృహన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ (Education Loan) మంజూరుచేయించారు. హాస్టల్ ఫీజు రూ.లక్ష అని చెప్పగా అది కూడా అందజేశారు.
