మెదక్ నియోజకవర్గం(Medak Constituency)లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు(Brs Party Support)తో గెలిచిన సర్పంచ్(Sarpanch)ల సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (MLA Harish Rao) హాజరయ్యారు. సర్పంచ్‌లను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat elections) ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారని అన్నారు. గెలిచిన సభ్యులందరికీ శిరస్సు వంచి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
హరీష్‌రావు ఇంకా ఏమన్నారంటే..
- ఇది మామూలు విజయం కాదు.
- ఎప్పుడైనా, ఏ రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచ్‌లు 80 నుంచి 90 శాతం మంది గెలుస్తారు.
- కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ 40 శాతం సర్పంచ్‌లు గెలిచింది.
- అంటే.. ఇది దేనికి సంకేతం?
- ఒకవైపు రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని తిరిగిండు.
- ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జిల్లా జిల్లాలు తిరిగిండు.
- అయినా కూడా జనం బండకేసి కొట్టారు.
- తెలంగాణ పల్లె ప్రజలు రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేలా తీర్పు ఇచ్చారు.
- గుద్దుడు గుద్దితే 4000 సర్పంచ్‌లను బీఆర్ఎస్ గెలిచింది.
- సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గూబ గుయ్యిమనిపిచ్చిండ్రు ప్రజలు.
- రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయితది రేవంత్ రెడ్డికి.
- బీఆర్ఎస్ సర్పంచ్ విజయం చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు.
- 90 శాతం గెలవాల్సిన అధికార పార్టీ 50% లోపుకే పరిమితమైంది.
- 42 శాతం బీసీ రిజర్వేషన్ అని మోసం చేసిండు.
- రైతుబంధు అని మోసం.
- రైతులకు యూరియా ఇయ్యకుండా తిప్పలు
- రుణమాఫీ సగం మందికి కూడా కాలే.
- సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టిండు.
- దళిత బంధు బంద్ అయింది.
- కేసీఆర్ కిట్టు బంద్ అయింది.
- చెరువుల్లో చేపలు వేస్తలేరు.
- గొర్రెల పంపిణీ పథకం బంద్ అయింది.
- ఆడోళ్లకి ఫ్రీ బస్ అని మగవాళ్లకు డబుల్ టికెట్ కొడుతున్నాడు రేవంత్ రెడ్డి.
- కేసీఆర్ ఉన్నప్పుడు వడ్లమ్మడానికి ఎప్పుడైనా తిప్పలు అయిందా?
- యూరియా కావాలంటే తిప్పలు అయిందా?
- మళ్లీ కేసీఆర్ సార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
- గెలుపు అనేది మన బాధ్యతను పెంచుతుంది.
- ఊరిలో ఉండి కష్టపడి పని చేసుకోవాలి.
- ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి.
- బాధ్యతను నిలబెట్టుకోవాలి..
- సర్పంచుల అధికారాలపై శిక్షణా కార్యక్రమం పెట్టుకుందాం.
- ఓడినవాళ్లు నిరాశ చెందొద్దు.
- భవిష్యత్తు ఉంటుంది.
- గెలిచినవాళ్లు బాధ్యతతో పని చేయాలి.. మళ్లీ గెలవాలి.
- రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది.
- కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని వంగి వంగి దండాలు పెట్టి ఓట్లు అడిగిండు.
- యూరియా దొరకనప్పుడు ఎందుకు కుర్చీ వేసుకొని కూర్చోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
- పగలూ రాత్రీ రైతులు లైన్లలో నిల్చొని యూరియా కోసం తిప్పలు పడ్డప్పుడు ఎందుకు కుర్చీ వేసుకొని కూర్చోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
- గురుకులాల్లో పురుగులన్నం మాకొద్దని రోడ్లపై ధర్నా చేసినప్పుడు ఎందుకు కుర్చీ వేసుకొని కూర్చోలేదు?
- కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొననప్పుడు కుర్చీ వేసుకొని కూసోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
- అక్కాచెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 60,000 బాకీపడ్డాడు రేవంత్ రెడ్డి.
- రేవంత్ రెడ్డి ఇంటి ముందు కుర్చీ వేసుకొని కూర్చొని వసూలు చేయాల్సింది పోయి కుర్చీలు వేసుకొని కూర్చుని ఓట్లు అడుగుతారా?
- ప్రజలు తెలివైనోళ్లు.
- అందుకే కాంగ్రెస్‌ను బండకేసి కొట్టారు.
- బీఆర్ఎస్ని గెలిపించారు.
- రేవంత్ రెడ్డి.. ఫుట్ బాల్ షోకుల కోసం ఐదు కోట్లతో గ్రౌండ్ కట్టించుకోవడం కాదు..
- మెస్సీతో ఫుట్ బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు చేసినవ్.
- అందాల పోటీ కోసం 100 కోట్లు ఖర్చు చేసినవ్.
- నువ్వూ నీ మనవడు క్రికెట్ ఆడడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా?
- ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చెయ్..
- మెదక్ గణపురానికి, పాపన్నపేటకి నీళ్లు ఇస్తారా లేదా చెప్పడం లేదు.
- కేసీఆర్ ఉన్నప్పుడు మెదక్ జిల్లాలోని అన్ని మండలాలకు నీళ్లు వచ్చాయా లేదా..
- గణపురం ఆనకట్టను బీఆర్ఎస్సే కదా ఆధునికీకరించింది.
- బావుల దగ్గర రాత్రిపూట కరెంట్ ఉండటం లేదు.
- మళ్లీ పాత కాంగ్రెస్ రోజులు వచ్చాయి.
- రైతుల పక్షాన నిలబడదాం.
- ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం.
- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం.
- మన సర్పంచ్‌లను, వార్డు మెంబర్లను ఎవరైనా ఇబ్బంది పెట్టితే నాకు ఒక మెసేజ్ పెట్టండి.
- నేను డైరెక్ట్‌గా మీకు అండగా ఉంటా.
- మీ జోలికొస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు..
- మిమ్మల్ని తిప్పలు పెడితే రాసి పెట్టుకోండి.
- రెండేళ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. వడ్డీతో సహా చెల్లిద్దాం
- పదేండ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశాం.
- ఈ సారి మన ప్రభుత్వం వచ్చినంక అభివృద్ధి కోసం పని చేస్తాం.
- మన జోలికి వచ్చినోళ్ల పని పట్టడానికి కూడా పనిచేస్తాం.
- అధికారులు న్యాయంగా, ధర్మంగా పనిచేయాలి.
- ఏకపక్షంగా పనిచేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ పని పడతాం.
- Advertisement -
